జీమెయిల్ ఓపెన్ చేయాలంటేనే భయం. రోజూ పదుల సంఖ్యలో అనవసరమైన మెయిల్స్ వచ్చి పడుతుంటాయి. మీ స్పేస్ నింపేస్తుంటాయి. అయితే ఇలా చేస్తే సులభంగా వాటిని తప్పించవచ్చు. అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం ఎలా
జీ మెయిల్‌కు వచ్చే అనవసరమైన వేస్ట్ మెయిల్స్‌తో విసుగు చెందుతున్నారా..ఇకపై చాలా సులభంగా వాటిని నిలువరించవచ్చు
ఓ సులభమైన విధానం ద్వారా అనవసర మెయిల్స్‌ను సులభంగా నియంత్రించవచ్చు
ఈ మెయిల్స్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేసి శాశ్వతంగా నిలువరించవచ్చు
మార్కెటింగ్ లేదా ప్రొమోషనల్ మెయిల్స్ ఎలా అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలో తెలుసుకుందాం
ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో జీ మెయిల్ ఓపెన్ చేయండి
వేటిని అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో ఆ మార్కెటింగ్ లేదా ప్రొమోషనల్ మెయిల్స్‌పై క్లిక్ చేయండి
ఈ మెయిల్ ఓపెన్ అయ్యాక అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయాలి
అప్పుడొక డయలింగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ రెండోసారి అన్‌సబ్‌స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి నిర్ధారణ చేయండి
ఇక ఆ తరువాత మీకు అలాంటి మార్కెటింగ్ లేదా ప్రొమోషనల్ మెయిల్స్ ఆగిపోతాయి.