Top 10 Best Selling Cars: అమ్మకాల్లో దుమ్ములేపిన టాప్-10 కార్లు ఇవే.. కొనుగోలుకు జనాలు క్యూ..!
Ashok Krindinti
Jun 14,2024
';
మారుతి సుజుకి స్విఫ్ట్ మే నెలలో 19,393 యూనిట్లను విక్రయించింది. గతేడాది మే నెలతో పోల్చితే 12 శాతం వృద్ధిని సాధించింది.
';
టాటా పంచ్ 70 శాతం వద్ద గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది మే నెలలో అమ్మకాలు 11,124 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది మే నెలలో 18,949 యూనిట్లను విక్రయించింది.
';
మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలు కూడా 42 శాతం పెరిగాయి. మే నెలలో 16,061 యూనిట్ల అమ్మకాలు జరిపింది.
';
హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు ఒక శాతం మాత్రమే పెరిగాయి. మే నెలలో 14,662 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది మేలో 14,449 యూనిట్లను విక్రయించింది.
';
మారుతి సుజుకి వ్యాగన్ R అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. గతేడాది మే నెలలో 16,258 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది మేలో 14,492 యూనిట్లను అమ్మింది.
';
మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు 6 శాతం పెరిగాయి. గతేడాది మే నెలతో 13,398 యూనిట్లను విక్రయించగా.. మే 2024లో 14,186 యూనిట్లు అమ్మకాలు జరిపింది.
';
మారుతి సుజుకి ఎర్టిగా అమ్మకాలు 32 శాతం పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో 13,893 యూనిట్లు విక్రయించగా.. గతేడాది మేలో 10,528 యూనిట్లను అమ్మింది.
';
మహీంద్రా స్కార్పియో (స్కార్పియో క్లాసిక్ + స్కార్పియో-N) అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఏకంగా 47 శాతం అమ్మకాలు పెరిగాయి. మే నెలలో 13,717 యూనిట్లను విక్రయించింది.
';
మారుతి సుజుకి బాలెనో భారీ నష్టాలను చవిచూసింది. 31 శాతం అమ్మకాలు తగ్గాయి. గతేడాది మే నెలలో అమ్మకాలు 18,733 యూనిట్ల ఉండగా.. ఈ ఏడాది మే నెలలో 12,842 యూనిట్లకు పడిపోయాయి.
';
మారుతి సుజుకి ఫ్రాంక్స్ మే నెలలో 12,681 యూనిట్లను విక్రయించి లాభాలను అర్జించింది. గతేడాది మే నెలలో 9,863 యూనిట్లతో పోలిస్తే 29 శాతం పెరుగుదలను సాధించింది.