Mahashivratri 2023 Vrat Foods: మహా శివరాత్రి రోజు ఉపవాసంలో తీసుకునే అల్పాహరం ఫుడ్స్

Mahashivratri 2023 Vrat Foods: దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా వేడుకగా జరుపుకునే హిందువుల పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మహా శివరాత్రి ఫిబ్రవరి 18న శనివారం జరగనుంది. మహా శివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు అన్నీ ఈ వేడుకల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివ క్షేత్రాలన్నీ శివరాత్రి కంటే వారం ముందు నుంచే వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి.
 

  • Feb 16, 2023, 22:16 PM IST

Mahashivratri 2023 Fasting Time Lite Foods: మహా శివుడు, పార్వతి మాతా కళ్యాణం పురస్కరించుకుని మహా శివరాత్రి వేడుకలను జరుపుకుంటారనేది వేదాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజున శివ భక్తులు చాలా మంది ఉపవాసం ఉంటారు. రాత్రి వేళంతా జాగారం చేస్తారు. అయితే ఉపవాసం వేళ ఉపవాస వ్రతం దెబ్బతినకుండా తీసుకునే కొన్ని ప్రత్యేకమైన ఆహారాల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /4

ఉడకబెట్టిన ఆలుగడ్డ సాధారణంగా ఆలుగడ్డను ఆహారంగా తీసుకున్నప్పుడు అందులో ఉండే హై క్యాలరీల వల్ల ఎక్కువసేపు ఆకలిని దూరం చేస్తుంది. అందుకే ఉడకబెట్టిన ఆలుగడ్డను ముక్కలుగా కట్ చేసి పెరుగుతో అల్పాహారంగా తీసుకోవచ్చు.

2 /4

సాబుదానా / సగ్గుబియ్యం ఉపవాసం పాటించే సమయంలో సగ్గు బియ్యంతో అనేక రకాల రెసిపిలు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో జావా, కిచిడి వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా చేసుకోవచ్చు.

3 /4

పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు సాధారణంగా ఉపవాసంలో ఉన్నప్పుడు పాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవచ్చు. పాలు, పెరుగు, బర్ఫి, మఖానే ఖీర్ లాంటివి తీసుకోవచ్చు.

4 /4

ఫ్రూట్ చాట్ మహా శివరాత్రి ఉపవాసం వేళ కొన్నిరకాల పండ్లతో తయారు చేసిన చాట్‌ని కానీ లేదా పండ్లను కానీ ఆహారంగా తీసుకోవచ్చని పండితులు చెబుతుంటారు.