తిరుమల సహా భక్తులకు ఉచిత భోజనాన్ని అందించే భారతదేశంలోని 10 దేవాలయాలు ఇవే..
తిరుపతి తిరుమల వేంకటేశ్వర ఆలయం ప్రతి రోజు యాత్రికులకు అన్నదానం అందజేస్తుంది. TTD అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో భక్తులకు రుచికరమైన ఉచిత భోజనాన్ని అనునిత్యం అందజేస్తూ ఉంటారు.
ఒడిశా రాజధాని ఈ ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద వంటశాలలలో ఒకటి. ఆలయ సముదాయం లోపల ఆనంద్ బజార్ ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది. వంటశాలలో మహాలక్ష్మి దేవి స్వయంగా వంట చేస్తుందని భక్తుల విశ్వాసం.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు లంగర్ సేవను ఉచితంగా అందిస్తుంది. లంగర్లలో యాత్రికులకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారు.
అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ ఉంది. ఇక్కడ ఇది ప్రతిరోజూ దాదాపు లక్ష మందికి ఉచిత ఆహారాన్ని అందిస్తుంది. ప్రసాదంలో రోటీ, దాల్, సబ్జీ మరియు ప్రసాదం ఉంటాయి.
మహారాష్ట్రలోని శిరిడి సాయి బాబా మందిరంలో అందించే ఆహారాన్ని సాయినాథుని ప్రసాదంగా పరిగణిస్తారు. ఉచిత భోజనంలో పప్పు, చపాతీ, అన్నం మరియు కూరగాయలు ఉంటాయి. ప్రసాదాలయం ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే ఉచిత ఆహార వంటశాలలో అన్న ప్ర
కర్నాటకలో కొలువైన ధర్మస్థల ఆలయం ఎంతో పురాతనమైనది. ఇక్కడికి దర్శనం కోసం వచ్చే ప్రతి యాత్రికుడికి ఉచిత అన్న ప్రసాద భోజనం లభిస్తుంది. కులం, మతం, సంస్కృతి లేదా హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో రోజువారీ అన్నప్రసాదాన
ఇస్కాన్ బెంగుళూరు ఆలయ సందర్శకులకు నిత్య అన్నదాన అని పిలువబడే ఉచిత భోజన ప్రసాదాన్ని అందిస్తుంది.
ఉడిపి కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత మరియు నాణ్యమైన ఆహారం అందించబడుతుంది. ఆలయ ప్రాంగణంలో రోజూ అన్నదానం నిర్వహిస్తారు. రోజువారి అన్న ప్రసాదంలో అన్నం, సాంబారు, రసం, పాయసం ఉంటాయి.
కేరళలో కొలువైన శ్రీమహావిష్ణువు యొక్క పవిత్రమైన నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది పద్మనాభ స్వామి ఆలయం. పద్మనాభస్వామి ఆలయం భక్తులకు ఉచిత అన్నదానం అందిస్తుంది.
కేరళలో కొలువైన గురవాయూర్ దేవాలయంలోని ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులకు ఉచిత భోజనాన్ని ప్రసాదంగా అందిస్తున్నారు.
వారణాసిలో ఉన్న కాశీ అన్నపూర్ణ ఆలయంలో నిరంతరం భక్తులుకు నిరంతరం అన్న ప్రసాదాన్ని అందించడం అనాదిగా వస్తోంది.