బడ్జెట్‌ మొదట ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Ashok Krindinti
Jul 22,2024
';

భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్‌ను స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ ఏప్రిల్ 7, 1860న పార్లమెంట్‌లో సమర్పించారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన వ్యక్తి.

';

స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి నవంబర్ 26, 1947న ప్రవేశపెట్టారు.

';

అత్యధికసార్లు బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హాయాంలో ఆయన 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు.

';

సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్ పేరుపై ఉంది. 2020-21 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు మాట్లాడారు.

';

అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం 1977లో హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరిట ఉంది. ఆయన మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేవలం 800 పదాలలో ముగించేశారు.

';

లాంగెస్ట్ వర్డ్ కౌంట్ స్పీచ్ మన్మోహన్ సింగ్ 1991 బడ్జెట్ ప్రసంగం పదాల గణన పరంగా చాలా పెద్దది. ఆయన ప్రసంగం 18,604 పదాలు ఉంది.

';

1999 నుంచి బడ్జెట్ సమర్పించే సమయంలో మార్పులు జరిగాయి. అంతకముందు సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

';

1955 వరకు ఇంగ్లీష్‌లో మాత్రమే బడ్జెట్ ముద్రించేవారు. 1955 నుంచి హిందీలో కూడా ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది.

';

కోవిడ్-19 మహమ్మారి సమయంలో (2021-22) బడ్జెట్‌ను పూర్తిగా డిజిటల్‌గా సమర్పించారు.

';

VIEW ALL

Read Next Story