‘కల్కి’ సహా దీపికా పదుకొణే కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..
‘కల్కి’ చిత్రంలో దీపికా పదుకొణే సుమతి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయిన తీరును ఎవరు మరిచిపోలేదు.
‘యే జవానీ హై దీవానీ’ సినిమాలో దీపికా పదుకొణే నైనా తల్వార్ పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో ఆత్మగౌరవం గల అమ్మాయి పాత్రలో మెప్పించింది.
కాక్ టెయిల్ సినిమాలో దీపికా పదుకొణే వెరోనికా డి కోస్టా పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా దీపికా కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచింది.
ఛపాక్ సినిమాలో యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా దీపికా కెరీర్ లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.
పద్మావత్ రాణి పద్మావతి పాత్రలో టైటిల్ రోల్ లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో మరో మెట్టు పైకెక్కింది. అల్లావుద్దీన్ ఖిల్జీ కి తన రాజ్యం ఆక్రమించుకోవడంతో తనను తన సామ్రాజ్య స్త్రీలు ఆత్మాహుతి చేసుకునే గౌరవప్రదమైన పాత్రలో మెప్పించింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికాతో పాటు రణ్ వీర్ సింగ్ ఇద్దరూ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా దీపికా కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది.
పీకూ సినిమాలో దీపికా పదుకొణే పీకూ బెనర్జీ పాత్రలో జీవించింది. తండ్రి కోసం తపన పడే కూతురు పాత్రలో ఒదిగిపోయింది.
దీపికా పదుకొణే తొలిసారి తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన ఈ సినిమా వీళ్లిద్దరి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయింది.