సమంత (Samantha Ruth Prabhu) కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత దశాబ్దంన్నరగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.
తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో కథానాయికగా పరిచయమైంది సమంత.
కెరీర్ మొదట్లోనే వరుసగా ఏమాయ చేసావే, బృందావనం, దూకుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ అందుకున్న భామగా రికార్డు క్రియేట్ చేసింది.
గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన 'శాకుంతలం' వంటి పౌరాణిక సినిమాలు కూడా కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తూ సత్తా చాటుతోంది.
సమంత.. ఆ మధ్య మయాసిటీస్ అనే వింత వ్యాధితో బాధపడి తిరిగి కోలుకుంది. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌తో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సమంత ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేస్తోంది. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో ఈమె ఎల్టీటీఈ ఉగ్రవాది పాత్రలో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
సమంత, వరుణ్ ధావన్‌తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'సిటాడెల్' వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేసింది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘హనీ బన్ని’ అనే టైటిల్ పెట్టారు.
సమంత.. పర్సనల్ విషయానికొస్తే.. ఆ మధ్య హీరో అక్కినేని నాగ చైతన్యతో ఈమె వివాహాం గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో రూ.40 లక్షల నుంచి ఇపుడు రూ.. 3 కోట్ల వరకు తీసుకునే స్థాయికి ఎదిగింది సమంత.
సమంత సినిమాల్లో వచ్చిన దానిని మ్యూచవల్ ఫండ్స్‌తో పాటు.. ముంబై, చైన్నై,బెంగళూరు, హైదరాబాద్‌లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొంత భరణం వచ్చింది.
ప్రస్తుతం సమంత ఆస్తుల విలువ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 250 కోట్ల నుంచి రూ. 300 కోట్లు వుంటుందని సినీ వర్గాల సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.