అలా అని గొంతు నొప్పి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడం మంచిది కాదు.
మరి ఇంట్లోనే చిన్న చిట్కాలతో ఈ గొంతు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందాలి అంటే ఇలా చేసి చూడండి.
గొంతు నొప్పికి ముందుగా మిరియాల టీ ఎంతో ఉపయోగపడుతుంది.
మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం కొద్దికొద్దిగా వేసి నీళ్లలో బాగా మరిగించి టీ చేసుకుని తాగండి.
లేదంటే బాగా మరిగించిన అల్లం నీళ్లు తాగండి.
గోరువెచ్చ తినేదిలో నిమ్మరసం, తేన కలుపుకొని తాగిన.. గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.
రోజులో వీలైనన్నిసార్లు పెరుగు తిన్నా కూడా మీరు గొంతు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.