Bathukamma: బతుకమ్మ పండగ.. 9 రోజులు 8 నైవేద్యాలు..ఇదే ప్రత్యేకత

';

బతుకమ్మ వేడుకలు

ఆశ్వయుజ మాసం ప్రారంభం అమావాస్య రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు 9 రోజులపాటు ఘనంగా జరుగుతుాయి. ఒక్కరోజు తప్ప మిగిలిన 8 రోజులు ఒక్కో రోజు ఒక్కో రకం నైవేద్యం బతుకమ్మకు సమర్పిస్తారు.

';

బతుకమ్మ ప్రసాదం

మహాలయ అమావాస్య రోజు తెలంగాణలో దీన్ని పెత్తరామస అని అంటారు. నువ్వులు, బియ్యం పింి, నూకలు కలిపి నైవేద్యంగా చేసి పెడతారు.

';

అటుకుల బతుకమ్మ

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. ఈ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి నైవేద్యం చేస్తారు.

';

ముద్దపప్పు బతుకమ్మ

ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసిన నైవేద్యంగా సమర్పిస్తారు

';

నానే బియ్యం బతుకమ్మ

నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా బతుకమ్మకు సమర్పిస్తారు.

';

అట్ల బతుకమ్మ

అట్ల లేదా దోశ నైవేద్యంగా బతుకమ్మకు సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ రోజూ వీధులన్నీ ఘుమఘమలాడుతుంటాయి.

';

అలిగిన బతుకమ్మ

ఈరోజు బతుకమ్మకు నైవేద్యం సమర్పించరు. అందుకే అలిగిన బతుకమ్మ అంటారు

';

వేపకాయల బతుకమ్మ

బియ్యం పిండిని వేయించి వేపపండ్లుగా తయారు చేసిన నైవేద్యంగా నివేదిస్తారు

';

వెన్న ముద్దల బతుకమ్మ

వెన్న లేదా నెయ్యి,నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.

';

సద్దుల బతుకమ్మ

బతుకమ్మ పండగల చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అనికూడా అంటారు. ఈ రోజు చింతపండుతో పులిహోర, కొబ్బరన్నం, నువ్వుల అన్నం, మలీదా, పెరుగన్నం, మామిడికాయ పచ్చడితో నైవేద్యాలు సమర్పిస్తారు.

';

VIEW ALL

Read Next Story