Diabetes Control Fruits: డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఈ ఫ్రూట్స్ చాలా ప్రయోజనకరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇట్టే తగ్గించగలవు
మధుమేహ వ్యాధిగ్రస్థులకు స్వీట్స్ తినకూడదు. తీపిగా ఉన్న పదార్ధాలు కూడా తినకూడదంటారు. ఎందుకంటే దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి
అందుకే తీపిగా ఉండే కొన్ని ఫ్రూట్స్ కూడా తినకూడదంటారు.
అయితే డయాబెటిస్ రోగులు స్వీట్ కూడా ఉండే ఈ ఫ్రూట్స్ తినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి డయాబెటిస్ నియంత్రణకు దోహదం చేస్తాయి
చిలకడదుంప డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. ఇది తీపిగా ఉన్నా సరే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఎందుకంటే్ ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది
బెర్రీస్ ఫ్రూట్స్ రుచిలో తీపిగా ఉంటాయి. కానీ డయాబెటిస్ రోగులకు బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రా బెర్రీలు చాలా మంచివి.
సిట్రస్ ఫ్రూట్స్ కూడా డయాబెటిస్ రోగులకు మంచివి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించగలవు
ఆపిల్ డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం. ఆపిల్ క్రమం తప్పకుండా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.