బార్లీ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే బార్లీని గరిబోళ్ల సంజీవని అని పిలుస్తుంటారు. బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బార్లీ నీళ్లు నిత్యం తాగితే కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. బార్లీనీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
డీహైడ్రేషన్, గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగితే ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది.
బార్లీ నీళ్లు తాగితే శరీరంలోని టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీలు మొత్తం క్లీన్ అవుతాయి. ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోనివ్వు. కిడ్నీ స్టోన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.
బరువు తగ్గడంతో కోసం జిమ్ కు వెళ్లేవారు ఉదయం, మధ్యాహ్నం బార్లీ నీళ్లు తాగాలి. ఇది బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా బార్లీ నీళ్లను తాగవచ్చు. బార్లీ నీరు అధిక రక్తపోటును అదుపులో ఉంచడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అంటే షుగర్ పేషంట్లు బార్లీ నీళ్లను తాగవచ్చు.
బార్లీతో పాటు ఉప్పు తక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రావు.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కొరకు మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోండి.