ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు.. కానీ చాలామంది ఐస్ క్రీమ్ తింటే బరువు పెరుగుతార.ని దానికి దూరంగా ఉంటారు. కానీ దాన్ని కూడా ఎంతో ఆరోగ్యంగా చేసుకోవచ్చు.. అదే మన ఈ షుగర్ లెస్ చాక్లెట్ ఐస్ క్రీమ్.
ముందుగా ఒక పాత్రలో.. ఒక కప్పు ఓట్స్ ని, ఒక 10 ఖర్జూరాలను.. ఐదు బాదం పప్పులు, ఐదు జీడిపప్పులను తీసుకోండి.
వీటన్నిటిని అరకప్పు పాలలో..వేసుకొని రెండు గంటలసేపు నానబెట్టుకోవాలి.
తరువాత దీనిని మిక్సర్ జార్ లో.. వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని.. ఒక కడాయిలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఒక కప్పు చాకో పౌడర్ ఇందులో వేసుకోండి. తరువాత రెండు స్పూన్ల ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ను కూడా వేసుకోవాలి.
చివరిగా ఒక కప్పు పాలు వేసుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర అయ్యేవరకు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి.
ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఈ మిశ్రమాన్ని వేసుకొని.. ఫ్రిజ్లో ఏడు నుంచి ఎనిమిది గంటలు ఉంచాలి. అంతే ఎంతో రుచిగా ఉండే షుగర్ లెస్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ.