శరీరంలో రక్తశాతం మంచిగా ఉన్నప్పుడే.. మన ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. మరి అలాంటి రక్తశాతం పెంచి కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచే.. బీట్రూట్ లడ్డు రెసిపీ మీకోసం..
ముందుగా ముప్పావు కప్పు బీట్రూట్ ని..చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్ లాగా చేసుకొని.. ఒక పలచటి క్లాత్లో వడకట్టుకోవాలి.
తరువాత ఒక కడాయిలో మూడు స్పూన్ల నెయ్యి. వేడి చేసుకొని కొంచెం జీడిపప్పు, కొంచెం ద్రాక్ష, వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో.. ఇంకొంచెం నెయ్యి వేసి.. కప్పు బొంబాయి రవ్వను.. వేయించుకోవాలి.
రవ్వ కొంచెం వేగిన తర్వాత.. అర కప్పు బీట్రూట్ రసాన్ని, అందులో వేసి సిమ్ లో.. వేయించుకోవాలి. ఒక మిక్సర్ జార్లో ముప్పావు కప్పు చక్కెర.. మూడు యాలుకలు వేసి పౌడర్ చేసుకోవాలి.
బొంబాయి బీట్రూట్ రవ్వ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసుకొని..అందులోనే ఈ చక్కెర పొడి కూడా వేసుకొని కొంచెం పాలు కలుపుకొని లడ్డు లాగా చేసుకోవాలి.
అంతే ఒంట్లో రక్త శాతం పెంచే బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ