చాలామందికి ఉప్మా అంటే నచ్చదు.. కానీ ఉప్మాని.. కూడా ఎంతో హెల్తీగా.. రుచికరంగా చేసుకోవచ్చు. అదే మన రాగి ఉప్మా. ఈ ఉప్మా వల్ల ఎన్నో అనారోగ్యాలకి కూడా చెక్ పెట్టొచ్చు. మరి ఈ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం.
ముందుగా ఒక పాత్రలో.. నాలుగు గ్లాసుల నీరును వేడి చేసుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని ఒక గుప్పెడు జీడిపప్పులను వేయించి.హ పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర.. వేసి చిటపటలాడించాలి తరువాత ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు.. వేసి వేయించుకోవాలి.
ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు.. వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని.. అందులో వేసుకోవాలి.
ఇవన్నీ బాగా వేగిన తర్వాత.. ఒక అరకప్పు బొంబాయి రవ్వ, ఒక అరకప్పు రాగి పిండిని.. వేసి బాగా వేయించుకోవాలి.
ఇవి వేగిన తర్వాత.. మరిగిన నాలుగు గ్లాసులు నీళ్ళను ఇందులో వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.
ఉప్మా దగ్గర పడే సమయానికి.. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును.. అందులో వేసి దించేయాలి అంతే రాగి ఉప్మా రెడీ.