ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అలాంటిదే ఉల్లి మాదిరి వెల్లుల్లి కూడా అంతటి మేలు చేస్తుంది.
సాధారణ రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించలా వెల్లులిని తినండి.
వెల్లుల్లి విటమిన్లు బీ 6, విటమిన్ సీలకు మంచి మూలం. ప్రోటీన్‌తో పాటు థయామిన్, పాంతోతేనిక్ యాసిడ్ కూడా ఉంటాయి.
కాల్చిన వెల్లుల్లిని కూడా తినవచ్చు. ఆవాల నూనెలో వెల్లులి వేయించి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది.
రోగ నిరోధక శక్తి వెల్లులిలో అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటే మీ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది.
వెల్లుల్లిని నిత్యం మీ ఆహారంలో భాగం చేసుకోండి. తద్వారా మీరు చక్కెర స్థాయిని కొనసాగించవచ్చు.
వ్యాయామంతో పాటు మంచి ఆహారపు అలవాట్ల సహాయంతో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించవచ్చు.
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, మధుమేహ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తినవచ్చు.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.