ఎండిన అల్లం తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఇందువల్ల లాభాలేమిటో ఒకసారి చూద్దాం.
అల్లం టీ మోషన్ సిక్నెస్,గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్,శస్త్రచికిత్స అనంతరం కలిగే వికారంను తగ్గించే సామర్థ్యం అధికంగా ఉంటుంది.
అల్లం ఉడకబెట్టడం వల్ల దాని నుంచి వచ్చే ఆరోమా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమెటరీ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కళంగా లభిస్తాయి.దీనితో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది.
చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ మరియు ఇన్ఫ్లమేషన్ వల్ల ఒళ్ళు నొప్పులు,కాళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ బాధపడేవారు..ఎండబెట్టిన అల్లం అరంగుళం మోతాదులో తీసుకొని,తేనెలో కలిపి తీసుకోవడం నొప్పులు కంట్రోల్ అవుతాయి.
అల్లం తీసుకోవడంతో ఆకలి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు వేగంగా తగ్గుతారు.
మహిళల్లో తరచూ వచ్చే పీరియడ్ సమస్యలు కూడా అల్లం టీ తో తగ్గిపోతాయి.
అల్లం టీ వారంలో రెండు సార్లు తాగడం వల్ల గ్యాస్టిక్ సమస్యలు కూడా దూరం అవుతాయి.