బరువు తగ్గడం.. రంగు పెరగటం.. ఈ రెండు కూడా.. మన రోజువారి ఆహారంలో చిన్న మార్పులు చేయడం ద్వారా పొందొచ్చు.
ఈమధ్య ఒక డాక్టర్.. తన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బరువు తగ్గి.. మొహంలో కాంతి రావాలంటే..కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలంట..
ఇందుకోసం ముందుగా తెల్ల అన్నం తినడం మానేయాలి.. చిరుధాన్యాలతో చేసిన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.
చక్కెరతో కూడిన పదార్థాలను, వేయించిన ఆహారాలు పూర్తిగా మానేయాలి.
మనం రోజు తినే ఆహారంలో అధిక ఫైబర్, ప్రొటీన్ ఉండేతట్టు చూసుకోవాలి. ముఖ్యంగా మనం తినే ఆహారంలో.. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి .
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు వాకింగ్, రన్నింగ్ వంటివి చెయ్యాలి.
ఇలా ఒక ఆరు నెలలు చేస్తే చాలు.. అందమైన శరీరాకృతి.. రంగు మీ సొంతం అవ్వడం ఖాయం.