మన ఇంట్లో ఉండే వస్తువులతో చేసిన నూనె ద్వారా.. జుట్టు రాలడం.. నివారించుకోవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా?
ముందుగా ఒక ఇనప కడాయిలో.. స్వచ్ఛమైన ఒక లీటరు కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేసుకోండి.
ఆ నూనెలోనే మూడు ఉల్లిపాయలను కచాపచాగా దంచి.. ఆ క్రష్ ను అందులో వేయండి.
ఉల్లిపాయలలో గల సల్ఫర్ జుట్టు ఊడకుండా ఉండడానికి.. ఎంతో తోడ్పడుతుంది.
తరువాత దానిలో ఒక కట్ట కరివేపాకును.. బాగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు లో గల ఆంటీ ఆక్సిడెంట్స్ డమినో ఆసిడ్స్.. మనకు జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి.
తరువాత అందులో అలువిరా జల్ ను కూడా వేసుకోవాలి. అలివేరులో గల విటమిన్-ఇ.. జుట్టు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది.
ఈ మూడు వస్తువులు మన ఇంట్లో చాలా.. సులువుగానే దొరుకుతాయి. ఇవన్నీ వేసిన కొబ్బరి నూనె మిశ్రమం సగ భాగం అయ్యేవరకు.. మరగనివ్వాలి.
దీన్ని రాత్రంతా ఆ ఇనుప పాత్రలోనే ఉంచాలి. మరుసటి ఉదయం ఒక పల్చటి గుడ్డలో.. ఈ నూనెను వడకట్టుకొని నిల్వ చేసుకోవాలి. అంతే జుట్టు రాలడం తగ్గించడానికి ఉపయోగపడే ఆయిల్ రెడీ