National Flag History: మువ్వన్నెల జండాకు ముందు జాతీయ జెండా ఎలా ఉండేదో ఎవరికైనా తెలుసా, బహుశా తెలియకపోవచ్చేమో
మొదటి జాతీయ జెండా 1904-1906 మధ్య కాలంలో రూపొందింది. దీనిని స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత రూపొందించింది.
1906లో మరో జెండా రూపుదిద్దుకుది. జెండాపై పైన నీలి రంగు ఉండి వాటిపై స్టార్స్ డిజైన్ ఉంటుంది. మధ్యలో పసుపు రంగు, అడుగున ఎరుపు రంగు ఉండేది
1906 ఆగస్టు 7వ తేదన దేశంలో తొలి అనధికారిక జెండా ఎగుర వేశారు. ఇద ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంది. మద్యలో వందేమాతరం అని రాసుంటుంది
1907 ఆగస్టు 2వ తేదీన జర్మనీలోని స్టట్ గార్ట్ లో మేడమ్ కామా జెండా ఎగురవేసింది. ఈ జెండాను మేడమ్ కామా, వీర్ సావర్కర్, శ్యామ్ జీ కృష్ణ వర్మ కలిసి తయారు చేశారు.
1917లో హోమ్ రూల్ లీగ్ కొత్త జెండా రూపొందించారు. ఇండియాలో ఆ సమయంలో డొమినియన్ స్టేట్ డిమాండ్ ఉండేది
192లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఓ జెండా తయారు చేశాడు. ఇది ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండేది. గాంధీజీ జెండాలో తెలుపు రంగు జోడించాలని సూచించారు
జెండా చరిత్రలో 1931 కీలకమైందని చెప్పాలి. ఈ ఏడాది మువ్వన్నెల జండాను జాతీయ జెండాగా ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇందులో మధ్యలో రాట్నం ఉండేది.
1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఈ జెండాను జాతీయ జెండాగా ప్రకటించింది. రాట్నం స్థానంలో అశోక చక్రం ఉంచారు.