భార్య భర్తల బంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు ముళ్ల బంధంతో రెండు మనసులు, వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతాయి. కష్టాసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అలాంటి ఈ బంధం.
నేటి కాలంలో వివాహ బంధానికి విలువ తగ్గింది. చిన్న విషయానికే గొడవపడి విడాకుల వరకు వెళ్తోంది. టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న జంటలను చూశాం.
ఎలాంటి కలతులు లేకుండా సంసారం సజావుగా సాగాలంటే భర్త భార్యను సంతోషపెట్టాలి. కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతే ఆ జంట ముఖాల్లో చిరునవ్వులు చూడవచ్చు.
భార్య, భర్త ఇద్దరూ కూడా నిజాయితీగా ఉండాలి. ఏ విషయాన్ని అయినా సేరే కలిసి పంచుకోవాలి. ఇలాంటి బంధంలో కలతలు రావు
భార్య భర్తను, భర్త భార్యను గౌరవించాలి. నలుగురిలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోకూడదు. భర్త పరువు పోతే భార్య పరువుకు భంగం కలిగినట్లే
భార్య భర్తలు ఇద్దరూ కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. భార్య తన తండ్రి నుంచి సంరక్షణ కోరుకున్నట్లు భర్త నుంచి కోరుకుంటుంది. కాబట్టి భార్యను తన బిడ్డలా చూసుకోవాలి.
భార్యకు అనారోగ్యం ఉంటే భర్త దగ్గరుండి బాగోగులు చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇష్టమైన వంటకం, ప్రేమగా మాట్లాడటం చేయాలి.
భార్య తనకు నచ్చిన వస్తువులు కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే అడిగితే పాజిటివ్ గా ఉండాలి.
భార్యకు ఇష్టంలేని పనులు అస్సలు చేయకూడదు. ఆమె మనస్సును అర్థం చేసుకుంటే..మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతే సంసారం సాఫీగా సాగిపోతుంది.