టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పాలతో పెట్టే టీ.. రోజు తాగడం అంత మంచిది కాదు. మరి ఆరోగ్యవంతమైన టీ ఎలా చేసుకోవాలో చూద్దాం..
ఈ రోజుల్లో స్త్రేస్ నుండి రిలీఫ్ కావాలంటే చాలామంది టీని తాగుతూ ఉంటారు. మరి అలాంటి టీనే ఆరోగ్యంగా తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిది.
ముందుగా ఒక కడాయిలో ఒక గ్లాస్.. నీళ్ళను వేడి చేసుకోవాలి.
తరువాత మూడు యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క..చిన్న ముక్క మరాఠీ మొగ్గ.. రెండు లవంగాలు బాగా దంచి వేసుకోండి.
అందులోనే నాలుగు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా.. గ్రైండ్ చేసి వేసుకోవాలి.
ఈ పౌడర్ ని.. ఆ నీళ్లల్లో బాగా మరగనివ్వాలి. ఈ టీ తక్కువ మరగకూడదు.. ఎక్కువసేపు మరగకూడదు.
కచ్చితంగా ఐదు నిమిషాలు ఉడికించి.. ఆఫ్ చేసుకోవాలి. చివరిగా రుచికి తగినంత తేనెను దాంట్లో చేర్చుకోవాలి.
ఈ టీని రోజు తీసుకోవడం వల్ల.. దగ్గు, జలుబు అనేది ఎప్పటికీ మీ దరికి చేరవు.