ప్రతిరోజూ కొన్ని చిట్కాలు పాటిస్తే సహజంగానే మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం.
మీ చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రెట్ గా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.
మీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకునేందుకు ప్రతిరోజూ గ్రీన్ టీ, కొబ్బరి నీరు, జ్యూస్ లు తాగవచ్చు.
సమయానికి నిద్రపోవడం వల్ల కూడా చర్మం మెరుస్తుంది. నిద్ర చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
మీ చర్మం అందంగా మెరవాలంటే ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడితో కూడిన జీవనశైలి చర్మంపై ఎఫెక్ట్ చూపుతుంది.
మీ చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలంటే సమతుల్య ఆహారం చేర్చుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు యోగా చాలా సహాయపడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల చర్మం లోపల నుంచి మెరుస్తుంది.
మీ చర్మం మెరిచేలా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుంది.