మొహం క్లియర్ గా..అందంగా కనిపించాలని.. అమ్మాయిలు ఎక్కువగా బ్యూటీ పార్లర్ లకి తిరుగుతూ ఉంటారు.
అయితే అలాంటిదేమీ అవసరం లేకుండా.. కేవలం ఇంట్లోనే చేసుకునే ఈ పసుపు - పెరుగు - శెనగపిండి ప్యాక్ తో.. నిగనిగలాడే చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు.
పసుపు , పెరుగు , శెనగపిండి.. మనకు ఇంట్లోనే దొరికే ఈ మూడు మిశ్రమాలు కూడా మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి.. అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి.
ఆ రెండిటిలోనే చిటికెడు పసుపు.. తేనె కూడా కలుపుకోండి.
ఈ నాలుగు వస్తువులను బాగా కలిపి మిశ్రమంలో చేసుకోవాలి..
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కాసేపు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది.