బీట్‌రూట్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు..
Shashi Maheshwarapu
Jun 26,2024
';
బీట్‌రూట్, ఎరుపు రంగులో మెరిసే ఈ కూరగాయ, చాలా రుచికరమైనది మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
';
బీట్‌రూట్‌లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్తపోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
';
నైట్రిక్ ఆక్సైడ్ కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అలసటను తగ్గిస్తుంది.
';
బీట్‌రూట్ ఐరన్‌కు మంచి మూలం, ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. రక్తహీనత లక్షణాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
';
బీట్‌రూట్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
';
బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.
';
నైట్రిక్ ఆక్సైడ్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
';
విటమిన్ సి ఇతర పోషకాలకు మంచి మూలం బీట్‌రూట్, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
';
బీట్‌రూట్‌లో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి.