ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఓట్స్ తో వడ చేసుకోవడానికి ముందుగా..స్టవ్ పైన కళాయి పెట్టి ఒక కప్పు ఓట్స్‌ను ఒక నిమిషం పాటు రోస్ట్ చెయ్యాలి.
మిక్సీలో వేసి పొడి కొట్టుకొని.. ఆ ఓట్స్ పొడిలో అరకప్పు బియ్యప్పిండి, ఒక స్పూన్ అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
అందులోనే పావు కప్పు పెరుగును కూడా వేసి బాగా కలపాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని రెండు గంటలసేపు వదిలేయాలి
ఇప్పుడు స్టవ్ పైన మీద కళాయి పెట్టి వలెను కాల్చుకోవడానికి సరిపడా నూనె వేయాలి.
ఆ నూనెలో ముందుగా చేసుకున్న ఓట్స్ మిశ్రమాన్ని గారెల్లా వత్తుకొని వేసుకోవాలి.
వడను రెండు పక్కల డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటిని తీసి టిష్యూ పేపర్ పై వేసుకుంటే అదనపు నూనెను పీల్చేస్తాయి. అంతే ఎంతో రుచికరమైన ఓట్స్ వడ రెడీ.