Brain Health: ఐన్‌స్టీన్‌లాగా చురుగ్గా మెదడు పని చేయాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినాలి.
మెదడు ఉత్సాహం, చురుగ్గా పని చేయడం, జ్ఞాపకశక్తి పెరగడం వంటి వాటి కోసం కొన్ని ఆహార పదార్థాలు దోహదం చేస్తాయి.
మెదడు ఆరోగ్యానికి సహాయపడే ఐదు ఉత్తమ ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.
Brain Health: యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదం చేస్తుంది. బ్లూబెర్రీస్ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే మెదడు మొద్దుబారడం కాకుండా ఉత్సాహంగా పని చేస్తుంది.
Brain Health: ఒమేగా 3 అనేది మెదడుకు చాలా దోహదం చేస్తుంది. ఫ్యాటీ ఫిష్ సాల్మన్, ట్రౌట్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3లు మెదడు, నరాల కణాల నిర్మాణంలో సహాయం చేస్తాయి. ఈ చేపలు తింటే నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Brain Health: విటమిన్ కె కోసం కూరగాయలు తినాలి. ఆకు పచ్చని కూరగాయలలో విటమిన్ కె, లుటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటివి ఉంటాయి. వీటితో మెదడు ఆరోగ్యకరమైన పోషకాలు అధికంగా ఉంటాయి.
Brain Health: విటమిన్ ఈ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గింజల్లో (నట్స్) యాంటీయాక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈతో నిండి ఉంటాయి. విటమిన్ ఈ మెదడును యాక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయ పడుతుంది.
Brain Health: గ్లూకోజ్ కోసం తృణధాన్యాలు తినాలి. మెదడుకు గ్లూకోజ్ ప్రధాన శక్తి అందిస్తోంది. తృణధాన్యాలతో గ్లూకోజ్ అందడంతో మెదడు వేగంగా పని చేస్తుంది.
Brain Health: ఆహారం సమతుల్యంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యకరంగా ఉంటుంది. సమతుల్య ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. నరాల వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.