మిగిలిపోయిన బ్రెడ్‌తో రుచికరమైన బ్రేడ్ కట్లెట్..

Dharmaraju Dhurishetty
Aug 19,2024
';

చాలామంది ఇళ్లలో బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది. దీనితో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు.

';

చాలామంది బ్రెడ్ తో బ్రెడ్ బజ్జీలు వేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా కట్లెట్ కూడా తయారు చేసుకోవచ్చు.

';

మిగిలిపోయిన బ్రెడ్ తో రుచికరమైన కట్లెట్ను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలు ఏంటో.. రెసిపీ పూర్తి వివరాలు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులు - 6, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - 1 టీస్పూన్, బంగాళదుంపలు (ఉడికించినవి) - 2

';

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరిగినవి), జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: బ్రెడ్ క్రంబ్స్ - 1 కప్పు, కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు, నూనె - వేయించడానికి

';

తయారీ విధానం.. మిశ్రమం తయారు తయారీ: మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా తరిగి, మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.

';

ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలు మెత్తగా మాష్ చేసి, బ్రెడ్ పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

';

కట్లెట్ ఆకారం: ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బంతులుగా చేసుకుని, వాటిని కట్లెట్ ఆకారంలో ఒత్తాలి.

';

కార్న్ ఫ్లోర్ పేస్ట్: ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్, కొంచెం నీరు వేసి పేస్ట్ చేయాలి.

';

కట్లెట్ కోటింగ్: తయారైన కట్లెట్లను కార్న్ ఫ్లోర్ పేస్ట్‌లో ముంచి, బ్రెడ్ క్రంబ్స్‌లో రోల్ చేయాలి.

';

వేయించడం: ఒక పాన్‌లో నూనె వేడి చేసి, కట్లెట్లను అందులో వేసి, రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

సర్వ్ చేయడం: వేడి వేడి కరకరలాడే బ్రెడ్ కట్లెట్లను టమోటా సాస్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story