లవంగాలలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ మైక్రో బయో లక్షణాలు అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి.
చాలామందిలో శరీరంపై వాపులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్యలు రావడం సర్వసాధారణం అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కూడా లవంగాలను వినియోగించవచ్చు.
లవంగాలలో అధిక మోతాదులో యువజన అనే పదార్థాలు లభిస్తాయి ఇది నోటి లోపలి బ్యాక్టీరియా ఫంగస్ ను తొలగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది దీనివల్ల నోటి దుర్వాసన రావడం తగ్గుతుంది.
ప్రతిరోజు లవంగాలను సరైన మోతాదులో వినియోగించడం వల్ల సులభంగా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయి.
ప్రతిరోజు లవంగాలను నమలడం వల్ల పంటి నొప్పి చిగుర్ల వాపు వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా దంతాలను శక్తివంతంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
వయస్సు మళ్ళిన వారిలో కీళ్లనొప్పులు తరచుగా వస్తూ ఉంటాయి. అయితే వీరు ప్రతిరోజు లవంగాలను వినియోగించి నొప్పుల ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని తినడం వల్ల కూడా మంచి ఉపశమనం పొందవచ్చు..
ప్రతిరోజు లవంగాలను నమలడం వల్ల సులభంగా జీర్ణ క్రియ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియలు మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడతాయి.
తరచుగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు లవంగాలను తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ప్రతిరోజు రాత్రి వీటిని నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే నమిలి తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు వీటిని రెండు లేదా మూడు తీసుకోవడం చాలా మంచిది.