మొహం మెరిసిపోవాలి అనుకుంటే.. చాలామంది బ్లీచ్ వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ దానివల్ల స్కిన్ సమస్యలు రావడం సహజం. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండే బ్లీచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం..
కాఫీ బ్లీచ్‌కి కావాల్సిన పదార్థాలు కాఫీ పొడి, పాలు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంవల్ల... చర్మాన్ని యవ్వనంగా ఉంచటమే కాకుండా మెరిసేలా కూడా చేస్తుంది.
బ్లీచ్ తయారు చేయడం చాలా సులభ.. ముందుగా కొద్దిగా కాఫీ పొడి తీసుకోవాలి.
ఈ కాపీ పౌడర్లో.. అసలు వేడి చేయని పచ్చి పాలు వేసి కలపాలి.
ఈ మిశ్రమంలో.. విటమిన్ ఇ క్యాప్సూల్‌లోని ఆయిల్ వేయండి. కానీ మీది ఆయిల్ స్కిన్ అయితే విటమిన్ ఇ క్యాప్సిల్ వాడకండి.
ఇప్పుడు అన్నిటిని కలిపి ముఖానికి రాసి అరగంటసేపు అలానే పెట్టుకోవాలి.
ఇది సహజమైన బ్లీచ్‌లా పని చేసి.. ముఖానికి ఇన్‌స్టంట్ గ్లోని ఇస్తుంది.