ఈ ఇండ్లీ తింటే మధుమేహం మటాష్‌..

Dharmaraju Dhurishetty
Jul 16,2024
';

మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

';

డయాబెటీస్‌ కారణంగా చాలా మందిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే తగ్గే ఛాన్స్‌ ఉంది.

';

రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

';

కాబట్టి మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారాల్లో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు అల్పాహారంలో పెసర పప్పు ఇడ్లీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా మధుమేహాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ పెసరపప్పు ఇడ్లీలను ప్రతి రోజు తినండి. అలాగే ఇప్పుడే తయారీ విధానం తెలుసుకోండి.

';

పెసర పప్పు ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 6 పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ, 2 టీస్పూన్ల కొబ్బరి తురుము

';

కావాల్సిన పదార్థాలు: 1/4 టీస్పూన్ వంటసోడా, 1 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల నూనె, 1/2 కప్పు పెరుగు, 1/4 టీస్పూన్ ఆవాలు

';

తయారీ విధానం: ఒక పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి, అందులో పెసరపప్పు వేసి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి (మెత్తబడటానికి).

';

కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు తదితర పదార్థాలను కలిపి బాగా రుబ్బుకోవాలి.

';

అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా నీళ్ళు లేకుండా విడిగా రుబ్బుకోవాలి. అనంతరం ఈ రెండు మిశ్రమాలను పెరుగుతో కలిపి, చివరగా వంటసోడా కలపాలి.

';

ఇడ్లీ రేకుల్లో పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని ఇడ్లీల్లా తయారు చేసుకొని స్టౌవ్‌పై పెట్టుకోండి.

';

ఇడ్లీలు ఉడికిన తర్వాత వాటిని వేడి వేడిగా సాంబార్, చట్నీతో కలిసి సర్వ్ చేసుకోండి.

';

మధుమేహంతో బాధపడేవారు రోజుకు మూడు పెసర పప్పు ఇడ్లీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

చిట్కాలు: పెసరపప్పును బాగా నానబెట్టడం వల్ల ఇడ్లీలు మెత్తగా ఉంటాయి.

';

చిట్కాలు: పిండిలో వంటసోడా వేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా ఉబ్బుతాయి.

';

VIEW ALL

Read Next Story