షుగర్ వ్యాధిగ్రస్తులకు జొన్న ఇడ్లీ ఎంతో మంచిది. ఈ ఇడ్లీ తయారీ విధానం కోసం ముందుగా ఆరు గంటల పాటు.. ఒక కప్పు మినప్పప్పుని కడిగి నాన్నపెట్టుకోండి.
మూడు కప్పుల జొన్న రవ్వను కూడా ఆరు గంటల పాటు నానబెట్టుకొంది.
ఆ తరువాత మినప్పప్పు వరకు మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోండి.
ఇప్పుడు మినప్పప్పు మిశ్రమాన్ని జొన్న రవ్వతో బాగా కలుపుకొని.. రాత్రంతా వదిలేయండి.
ఉదయాన్నే ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని.. ఈ పిండితో ఇడ్లీ కుక్కర్లో.. జొన్న ఇడ్లీలు పెట్టుకోండి.
15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను బాగా ఉడకనివ్వండి.
అంతే షుగర్ వ్యాధికి ఎంతో మంచిదైనా జొన్న ఇడ్లీ తయారు.