హీరోయిన్స్ లాంటి అందం కావాలా? ఈ సహజమైన చిట్కా మీ చర్మాన్ని మెరవడమే కాకుండా, దాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ప్రతిరోజూ చర్మాన్ని శుభ్రపరిచి, మాయిశ్చరైజ్ చేయడం అనేది అందం రహస్యాల్లో ఒకటి. కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న తర్వాత అలానే సాయంత్రం మొహం కడుక్కున్న తరువాత.. మేకప్ వేసుకునే ముందు తప్పకుండా మాయిశ్చరైసర్ అప్లై చేయడం ఉత్తమమైన పని.
తేనె, నిమ్మరసం కలిపిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. కాబట్టి ఈ పాక్ వారంలో తప్పకుండా రెండుసార్లు వేసుకోవాలి.
ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు తాగడం, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైంది.
స్నానం చేసే ముందు.. రెండుసార్లు పెసర పిండితో స్క్రబ్బింగ్ చేయడం చర్మాన్ని మెరుగు పరుస్తుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఈ స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత రైస్ వాటర్ తో మీ మొహం కడుక్కోవడం. అనగా బియ్యం నానబెట్టిన నీతితో మొహం కడుక్కోండి.
ఇక ఆ తరువాత.. మంచి మాయిశ్చరైసర్ దానిపైన మంచి క్రీమ్ పూసుకోవాలి.
సరైన ఆహారం, ఎక్కువ నీటి తాగడం, వ్యాయామం సహజమైన అందానికి కీలకమైనవి. ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో అయితే.. నెలలోనే మీ మొహం ఎంత అందంగా మారుతుందో మీరు గమనించవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు.. వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.