మనలో చాలా మందికి ముఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని పిగ్మేంటేషన్ అంటారు. తెల్లముఖంపై నల్లగా కనిపించే మచ్చలు అందవిహీనంగా కనిపిస్తాయి.
ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు శెనగపిండిని ముఖానికి రాసుకున్నట్లయితే మచ్చలన్నీ తొలగిపోతాయి. శెనగపిండితో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం.
శెనగపిండిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టును ముఖంపై అప్లయై అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
శెనగపిండిలో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని కడుక్కోవాలి. కొన్నాళ్లపాటు ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.
అలోవెరాలో యాంటీ బయాటిక్ లక్షణాలు ఉన్నాయి. శెనగపిండిలో అలోవెరా కలుపుకుని ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
ఈ మూడింటిని మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు తొలగిపోయి ముఖం మెరిసిపోతుంది.
ఫేస్ ప్యాకులతోపాటు ఒత్తిడి లేని జీవనశైలి కూడా చర్మఆరోగ్యానికి మేలు చేస్తుంది. సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు డైట్లో చేర్చుకుంటే ముఖంలో గ్లో పెరుగుతుంది.