ఈ చట్నీ డయాబెటిస్ ఉన్నవారికి వరం.. రోజు తింటే షుగర్‌కి బై బై..

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

మధుమేహంతో బాధపడేవారు వివిధ రకాల చట్నీలను రోజూ తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ.. ఏమాత్రం ఆపకుండా తింటూ ఉంటారు.

';

నిజానికి మధుమేహం ఉన్నవారు ఆరోగ్య నిపుణులు సూచించే కొన్ని రకాల చట్నీలు తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

ముఖ్యంగా మెంతి ఆకులతో తయారుచేసిన చట్నీ క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.

';

మెంతి ఆకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి దీనితో చేసిన చట్నీ రోజు తింటే విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

';

చాలామంది మెంతికూర చట్నీ తయారు చేసుకునే క్రమంలో వివిధ రకాల పొరపాట్లు పడుతున్నారు. దీనివల్ల సరైన రుచి పొందలేకపోతున్నారు. ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు.

';

మెంతికూర చట్నీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు: మెంతికూర - ఒక కప్పు, పచ్చిమిర్చి - 4-5, ఎండుమిర్చి - 2-3

';

కావలసిన పదార్థాలు: ధనియాలు - 1 స్పూన్, జీలకర్ర - 1/2 స్పూన్, నువ్వులు - 1 స్పూన్, నూనె - 2 స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - కొద్దిగా

';

తయారీ విధానం: ముందుగా మెంతికూరను బాగా శుభ్రం చేసుకుని తడి ఆరేంతవరకు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత స్టౌవ్ పై ఒక పాన్ పెట్టుకుని అందులో తగినంత నూనెను వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు వేసి వేయించుకోవాలి.

';

ఇలా అన్ని వేగిన తర్వాత మెంతికూరను వేసుకొని కూడా బాగా వేపుకోవాల్సి ఉంటుంది. మెంతికూరలో నీరు ఎగిరిపోయేంతవరకు బాగా కలుపుతూ వేపుకోండి.

';

ఇలా బాగా వేగిన తర్వాత అందులో కావలసినంత కరివేపాకు వేసి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి.

';

ఇలా అన్ని కలిపిన మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పచ్చడిలో రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని గాజు సీసాలో భద్రపరచుకోండి. అంతే సులభంగా మెంతికూర చట్నీ తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story