ఆరోగ్యం ఎప్పుడు మితంగా తీసుకోవడం మంచిది. మనం ఎక్కువగా తినడం మానుకోవాలి అంటే..మీ భోజనానికి ముందు.. తప్పకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి.
తినే ప్రతిసారి.. చిన్న మోతాదుగా తినడం అలవాటు చేసుకోండి. అంటే ఏదైనా సరే రెండు గంటలు గ్యాప్ ఇస్తూ తినండి.
ఆహారాన్ని పూర్తిగా తినకపోవడం.. మీ ఆకలిని పెంచుతుంది, ఎక్కువ తినాలి అనిపించేలా చేస్తుంది. కాబట్టి దాని బదులు.. రోజులో గ్యాప్ ఇస్తూ కొద్దికొద్దిగా తినడం మంచిది.
కూరగాయలు, పండ్లు తినడం.. మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగండి.
తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమలడం..తక్కువ తినడానికి దోహదపడుతుంది.
రోజు ఎంత తింటున్నారో గమనించండి, మితంగా భోజనం చేయండి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.