తయారీ విధానం: ముందుగా కోడిగుడ్డు టమాటో కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని బాగా వేడి చేసుకోండి.
';
నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వాసన పోయేంతవరకు బాగా వేపుకోండి.
';
ఇలా వేపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి అవి మెత్తబడేంతవరకు బాగా ఉడికించుకోండి.
';
టమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత కావాలనుకుంటే పులుపు కోసం అందులో కొంత చింతపండు రసం కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తగినంత కారం, ధనియాల పొడి, పసుపు వేసి ఉడికించుకోండి.
';
అన్నీ బాగా ఉడికిన తర్వాత రుచికోసం తగినంత ఉప్పు వేసుకొని నూనెలో బాగా వేపుకున్న కోడిగుడ్లను వేసి మరో పది నిమిషాలు బాగా ఉడికించుకోండి.
';
ఇలా బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించి సర్వ్ చేసుకోండి.