Green Peas: పచ్చి బఠానీలు తింటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా?

Bhoomi
Jul 19,2024
';

పచ్చిబఠానీ ప్రయోజనాలు

పచ్చి బఠానీల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని క్రమం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం.

';

పుష్కలంగా పోషకాలు

పచ్చిబఠానీల్లో ఒమేగా 3 కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. నిత్యం డైట్లో చేర్చుకుంటే ముఖంపై ముడతలు తగ్గుతాయి.

';

మెరుగైన జీర్ణక్రియ

పచ్చి బఠాణీల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై మలబద్ధకం సమస్య ఉండదు.

';

చక్కెర నియంత్రణ

పచ్చి బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. ఇందులోని పీచు, ప్రొటీన్లు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.

';

బరువు తగ్గడానికి

ఇందులో విటమిన్లు ఎ,సి, కే, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, వంటి ఖనిజాలు పుష్కలగా ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.

';

ఆర్థరైటిస్

బఠానీల్లో ఉండే పోషకాలు అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి. కాబట్టి వీటిని తరచుగా డైట్లో చేర్చుకోవాలి.

';

ఎముకలు బలంగా

పచ్చి బఠానీలు ఎముకలను బలంగా ఉంచుతాయి. వర్షాకాలంలో వచ్చే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

కొలెస్ట్రాల్ నియంత్రణ

బఠానీలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇందులోని నియాసిన్ కంటెంట్, చెడు కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story