వరుసగా 30 రోజుల పాటు ఈ గింజలు నానబెట్టుకుని తింటే మీ బాడీలో జరిగే మార్పులు ఇవే

Bhoomi
Sep 28,2024
';

వేరుశనగ, ఎండుద్రాక్ష

వేరుశనగలు, ఎండుద్రాక్ష ఈ రెండింటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ నీళ్లలో నానబెట్టుకుని రోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

';

గుండెకు మేలు

వేరుశనగలో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెపనితీరును మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగ్గా చేస్తుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

';

జీవక్రియను మెరుగుపరుస్తాయి

వేరుశనగ, ఎండు ద్రాక్ష రెండింటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని నీటిలో నానబెట్టుకుని తింటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు దూరం అవుతాయి.

';

శక్తిని పెంచుతాయి

నానబెట్టిన వేరుశనగ, ఎండుద్రాక్ష తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రోజూ ఉదయాన్నే వీటిని తింటే బలహీనత సమస్య తగ్గుతుంది.

';

కొలెస్ట్రాల్

నానబెట్టిన వేరుశనగ, ఎండు ద్రాక్షలను రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

';

బరువు తగ్గడం

నానబెట్టిన వేరుశనగ, ఎండుద్రాక్ష తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రొటీన్, అవసరమైన కొవ్వు, ఫైబర్ తోపాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి.

';

రక్తపోటు

నానబెట్టిన ఎండుద్రాక్ష, వేరుశనగలు తినడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది. మీరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ వీటిని తినండి.

';

దంతాలు, ఎముకలు

వేరుశనగలు, ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం వల్ల దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story