ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువమందికి వచ్చే సందేహం కారు సీట్ బెల్టు వేసుకోవచ్చా లేదా అని.
మరి అలాంటి సందేహం మీకు కూడా ఉంటే.. ఇదొకసారి చదివేయండి..
కారులో ప్రయాణించేటప్పుడు మనం క్షేమంగా చేరాలంటే.. ప్రతి ఒక్కరూ సీటు బెల్టులు ధరించడం తప్పనిసరి.
గర్భధారణ సమయంలో సీట్ బెల్ట్ వేసుకోవడం మరింత ముఖ్యమైనది.
ముఖ్యంగా ఈ సీట్ బెల్ట్ వేసుకోవడం ద్వారా గర్భిణీ స్త్రీకి సడన్ బ్రేక్ వేసినప్పుడు.. అకస్మాత్తుగా షాక్ లేదా నొప్పి అనిపించదు.
కానీ ప్రెగ్నెంట్ స్త్రీలు సీట్ బెల్ట్ ను పొట్టపైన కాకుండా పొట్ట కింద కట్టుకోవాలి.
అంతేకాకుండా బిగుతుగా సీట్ బెల్ట్ పెట్టుకోకూడదు.
ముఖ్యంగా బెల్ట్ ను కొద్దిగా వదులుగా ఉంచండి, తద్వారా మీ పొట్ట పై చాలా బిగుతుగా అనిపించదు. కాబట్టి ఇలాంటి చిన్న చిట్కాలు పాటించడం మంచిది.