మిక్స్డ్ స్ప్రౌట్స్ పరోటా.. రోజు ఒకటి తింటే.. మీ పవర్‌ బూస్ట్‌..

Dharmaraju Dhurishetty
Dec 25,2024
';

మిక్స్డ్ స్ప్రౌట్స్ పరోటా తినడం వల్ల పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి.

';

ముఖ్యంగా ఈ స్ప్రౌట్స్ పరోటాలో ఉండే ప్రోటీన్స్‌ అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

';

మీరు కూడా ఈ మిక్స్డ్ స్ప్రౌట్స్ పరోటాను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

';

పిండి కోసం కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 1 కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1/2 టేబుల్ స్పూన్, నీరు - తగినంత

';

స్టఫింగ్ కోసం: మిక్స్డ్ స్ప్రౌట్స్ (పెసలు, శెనగలు, బొబ్బర్లు మొదలైనవి) - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగిన), అల్లం - 1/2 ఇంచ్ (సన్నగా తరిగిన)

';

స్టఫింగ్ కోసం కావలసిన పదార్థాలు: కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగిన), గరం మసాలా - 1/2 టీ స్పూన్, ధనియాల పొడి - 1/2 టీ స్పూన్

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర పొడి - 1/4 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్

';

తయారీ విధానం: ముందుగా ఈ పరాఠాను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు, నూనె వేసి మిక్స్‌ చేసుకోండి. అలాగే తగినంత నీరు పోసి మెత్తని పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోండి.

';

స్టఫింగ్ తయారు చేయు విధానం: స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చితో పాటు అల్లం వేసి బాగా వేయించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అందులోనే స్ప్రౌట్స్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడితో పాటు ఉప్పు వేసి బాగా వేపుకోండి.

';

ఇలా మిశ్రమాన్ని దాదాపు 2 నుంచి 3 నిమిషాలు వేయించి కొత్తిమీర వేసి మిక్స్‌ చేసుకోండి.

';

పరాఠా తయారి విధానం: ఈ పరోటాను తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత చపాతీలా పిండిని ఒత్తుకుని.. అందులో స్టఫింగ్ పెట్టి అంచులు మూసివేయాలి.

';

ఆ తర్వాత పై నుంచి మరో చపాతీ వేసుకుని పరాఠాల తయారు చేసుకుని పెనంపై కల్చుకోండి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story