హెల్తీ మోమోస్‌.. తినండి బాబు తినండి!

Dharmaraju Dhurishetty
Dec 25,2024
';

గోధుమ పిండితో చాలా మంది మోమోస్ కూడా తయారు చేసుకుంటారు.

';

గోధుమ పిండితో చేసిన మోమోస్ తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

';

గోధుమ పిండి మోమోస్‌ను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి - 1 కప్పు, నీరు - తగినంత, ఉప్పు - చిటికెడు

';

స్టఫింగ్ కోసం: ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగిన), క్యాబేజీ - 1 కప్పు (చిన్నగా తరిగిన), క్యారెట్ - 1/2 కప్పు (తురిమిన)

';

స్టఫింగ్ కోసం: పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన), అల్లం - 1/2 అంగుళం (తురిమిన), నూనె - 1 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, గరం మసాలా - రుచికి సరిపడా

';

తయారీ విధానం: ముందుగా ఈ మోమోస్‌ను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి కలుపుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోస్తూ మెత్తటి పిండిలా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టిన పిండిని 20 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఇలా చేసిన తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా చేసిన తర్వాత క్యాబేజీ, క్యారెట్ వేసి కొద్దిసేపు వేయించుకోవాల్సి ఉంటుంది.. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.

';

స్టఫింగ్ చల్లారిన తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వాటిని చిన్న పూరీలా ఒత్తుకోవాలి.

';

ఇలా చేసిన మధ్యలో స్టఫింగ్ పెట్టి మోమోస్‌లా చుట్టుకోవాలి. ఆ తర్వాత స్టీమర్‌లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story