నార్త్ ఇండియాలో టమాటో రసం ఒక విధంగా తయారు చేసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరో విధంగా తయారు చేసుకుంటారు.
';
తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసుకునే టమాటో రసంలో కొంతమంది తాటి బెల్లం కూడా వినియోగిస్తారు. ఇది రుచిని అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.
';
ముఖ్యంగా టమాటో రసంతో పాటు పప్పు అన్న కాంబినేషన్ తో తింటే భలే ఉంటుంది. మీరు కూడా టమాటో రసాన్ని ఆంధ్ర స్టైల్ లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి.
';
ఆంధ్ర స్టైల్ లో టమాటో రసం తయారీ విధానం, కావలసిన పదార్థాలు: టమాటాలు - 4 (పెద్దవి), పచ్చిమిర్చి - 2 (చీలికలు),.కొత్తిమీర - కొద్దిగా (తరుగు), నూనె - 1 టేబుల్ స్పూన్, ఆవాలు - 1/2 టీ స్పూన్
';
కావలసిన పదార్థాలు: జీలకర్ర - 1/2 టీ స్పూన్, మెంతులు - 1/4 టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఇంగువ - చిటికెడు, పసుపు - 1/4 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నీళ్లు - 1/2 లీటర్
';
తయారీ విధానం: ముందుగా టమాటో రసాన్ని తయారు చేసుకోవడానికి.. టమాటోలను తీసుకొని బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఆ తర్వాత కొత్తిమీర కాడలను కూడా శుభ్రం చేసుకుని వాటిని కూడా కట్ చేసుకుని టమాటోలో వేసుకొని మిక్సీ కొట్టుకోండి.
';
ఇలా మిక్సీ పట్టుకున్న రసాన్ని స్టవ్ పై పెట్టుకున్న బౌల్లో పోసుకోండి. ఆ తర్వాత అందులో తగినంత మిర్యాల పొడి, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి.
';
కావాలనుకుంటే ఆ ఉడుకుతున్న రసంలో తగినంత నీటిని వేసుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న రసాన్ని పక్కన పెట్టుకోండి.
';
ఆ తర్వాత ఓ బౌల్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకుని అన్ని రకాల పోపు దినుసులు వేసి చిటపటనాలనివ్వండి. అన్ని బాగా వేగిన తర్వాత అందులో తగినంత మిర్యాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి.
';
అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా తయారుచేసుకుని పోపును రసంలో వేసుకుని మిక్స్ చేసుకోండి. అంతే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే టమాటా రసం తయారైనట్లే..