ఉదయాన్నే పొట్ట క్లీన్ అవ్వాలంటే రాత్రి ఇవి తినండి..
Dharmaraju Dhurishetty
Jul 27,2024
';
మలబద్ధకం గ్యాస్ట్రిక్ ఇతర పొట్ట సమస్యలు రావడానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
జంక్ ఫుడ్ తినడం వల్ల పొట్టలో అన్ని రకాల పదార్థాలు పేరుకుపోయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
';
ముఖ్యంగా యువతలోనైతే ఎక్కువగా పొట్ట సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
పొట్ట క్లీన్‌గా లేకపోవడం కారణంగా కొంతమందిలో ఆహారం జీర్ణం కాలేకపోతోంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
';
పొట్ట ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉండడం ఎంతో మంచిది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పొట్ట క్లీన్‌గా ఉండడానికి రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు..
';
పొట్ట క్లీన్‌గా ఉండడానికి రాత్రిపూట తప్పకుండా నానబెట్టిన సోంపు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కొన్ని గుణాలు పొట్టను క్లీన్‌గా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.
';
సోంపు నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు రాత్రి తప్పకుండా ఈ నీటిని తీసుకోండి.
';
దీంతోపాటు రాత్రి పూట నానబెట్టిన అంజీర్ని తినడం వల్ల కూడా పొట్ట క్లీన్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
నానబెట్టిన అంజీర్ లో ఉండే ఫైబర్ ఉదయం మలాన్ని సాఫీగా బయటకు పంపేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
';
అలాగే ప్రతిరోజు రాత్రిపూట ఒకటి నుంచి రెండు అరటి పండ్లను తినడం వల్ల కూడా పొట్ట క్లీన్ అవుతుంది.
';
రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా జీర్ణ క్రియ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.