గర్భధారణ సమయంలో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తల్లి కోరుకుంటుంది. అందుకే ప్రతిరోజూ పోషకాహారాన్ని తినాలని వైద్యులు సూచిస్తారు.
గర్భిణీలు పండ్లు తినాలని వైద్యులు చెబుతుంటారు. కానీ కొన్ని పండ్లు తినకూడదని సూచిస్తారు. మరి గర్భిణీలు అవకాడో తినవచ్చా. తింటే ఏమౌతుంది. తెలుసుకుందాం.
గర్భాధారణ సమయంలో మహిళలు మలబద్దకం, గుండెల్లో మంట వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమయంలో అవకాడో తింటే జీర్ణసమస్యలు తగ్గుతాయి.
అవకాడోలో ఫైబర్, మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫలితంగా గర్భధారణ సమయంలో డయాబెటిస్, ప్రీక్లాంప్సియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కడుపులో పెరుగుతున్న శిశువు మెదడు, నాడి, ఎర్రరక్తకణాల అభివ్రుద్ధికి ఎక్కువల కేలరీలు అవసరం. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ కేలరీలను పొందడంలో సహాయం చేస్తాయి.
అవకాడోలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గర్బిణీల రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.
గర్భిణీలు చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అవకాడోలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ పండు తినడం ఎంతో మేలు.
అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తింటే గర్భిణీలకు అధిక రక్తపోటు తగ్గుతుంది.