ప్రాసెస్ ఫుడ్: వేయించిన, ఫ్రై చేసిన ఆహారాలు అధిక కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండెపోటుకు కారణమవుతాయి.
ప్యాక్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన ఆహారాల్లో సోడియం, కృత్రిమ రంగులు, రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చక్కెర పదార్థాలు: కేక్‌లు, బిస్కెట్లు, సోడా వంటి చక్కెర పదార్థాలు బరువును పెంచి, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి.