యమ డేంజర్ ఆహారాలు.. తింటే గుండెపోటే!

Dharmaraju Dhurishetty
Jul 26,2024
';

ప్రస్తుతం యువత కూడా గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

';

గుండె సమస్యల కారణంగా ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కొంతమందిలో గుండె సమస్యల కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి.

';

గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారాలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తున్నాయి.

';

గుండెపోటుకు దారితీసే 8 రకాల ఆహారాలు..

';

రెడ్‌ మీట్‌: ఎర్రటి మాంసంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలలో పూడికలు ఏర్పడటానికి దారితీసి, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

';

ప్రాసెస్‌ ఫుడ్‌: వేయించిన, ఫ్రై చేసిన ఆహారాలు అధిక కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండెపోటుకు కారణమవుతాయి.

';

ప్యాక్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన ఆహారాల్లో సోడియం, కృత్రిమ రంగులు, రుచులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

చక్కెర పదార్థాలు: కేక్‌లు, బిస్కెట్లు, సోడా వంటి చక్కెర పదార్థాలు బరువును పెంచి, డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి.

';

హైడ్రోజనేటెడ్ నూనెలు: ఈ నూనెలు చాలా ఆహారాలలో ఉపయోగించడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పూర్తిగా పెరుగుతాయి.

';

ఆల్కహాల్: అధికంగా ఆల్కహాల్ తాగడం రక్తపోటును పెంచి, గుండె కండరాలను దెబ్బతీస్తుంది.

';

సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు: అధిక సోడియం రక్తపోటును పెంచి, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

';

ఎర్రటి మిర్చి: ఎర్రటి మిర్చిలో కెప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కూడా గుండెకు హాని కలిగిస్తుంది.

';

VIEW ALL

Read Next Story