ఇది తాగితే గుండె దృఢంగా అవ్వడం ఖాయం!

Dharmaraju Dhurishetty
Jul 26,2024
';

గుండె ఆరోగ్యం: లెమన్ గ్రాస్ టీ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

క్యాన్సర్ నిరోధకం: కొన్ని అధ్యయనాల ప్రకారం, లెమన్ గ్రాస్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే గుణాలను కూడా కలిగి ఉంటుంది.

';

జీర్ణ వ్యవస్థ మెరుగు: లెమన్ గ్రాస్ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

రోగ నిరోధక శక్తి పెరుగుదల: లెమన్ గ్రాస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

';

మనోధైర్యం పెరుగుదల: లెమన్ గ్రాస్ టీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

';

చర్మ సంరక్షణ: లెమన్ గ్రాస్ చర్మానికి చాలా మంచిది. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి, ముఖంపై మొటికలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

';

కీళ్ల నొప్పులు తగ్గుదల: లెమన్ గ్రాస్ టీ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గించడానికి సహాయపడుతుంది.

';

లెమన్ గ్రాస్ టీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ లెమన్ గ్రాస్ (తాజాగా లేదా ఎండినది), తేనె లేదా చక్కెర

';

తయారీ విధానం: ముందుగా ఈ టీని తయారు చేయడానికి ఒక పాత్రలో నీటిని మరిగించండి.

';

నీరు మరిగిన తర్వాత, లెమన్ గ్రాస్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

';

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, టీని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

టీని వడగట్టి, తేనె లేదా చక్కెర వేసి బాగా మిక్స్‌ చేసుకుని తాగాల్సి ఉంటుంది.

';

లెమన్ గ్రాస్ టీని వేడిగా లేదా చల్లగా కూడా తాగవచ్చు. గుండె సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు రెండు సార్లు తాగండి.

';

VIEW ALL

Read Next Story