ఉల్లి రసం జుట్టుకి ఔషధం లాంటిది.. చుండ్రు పోగొట్టడం దగ్గర నుంచి.. నల్లగా ఉండే పొడుగు జుట్టు రావడం వరకు.. అన్ని విధాల ఈ రసం పనికొస్తుంది.
ఉల్లిపాయల్లో ఫోలిక్ యాసిడ్, పొటాషియం, జింక్, సల్ఫర్ తో పాటు విటమిన్ డి.. పుష్కలంగా లభిస్తుంది.
మరి ఉల్లి రసంలో ఉండే ఈ ఔషధాలు అన్నీ మన జుట్టుకి లభించాలంటే ఏమి చేయాలో ఒకసారి చూద్దాం..
ముందుగా ఒక ఐదు చెంచాల ఉల్లిపాయ రసం తీసి పెట్టుకుని.. అందులో రెండు చెంచాల పతిక కలుపుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి బాగా మసాజ్ చేసుకోండి..
ఒక గంట తరువాత.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
ఉల్లిపాయ రసంలో ఉండే విటమిన్స్.. మనకు జుట్టు భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా.. జుట్టుకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా పోతాయి.