రెండు కప్పుల మైదా, 3 చెంచాల నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని.. నీళ్లు కలుపుతూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ పైన కడాయి పెట్టి.. నూనె వేసుకుని వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు.. ఉల్లికాడల ముక్కలు వేసుకుని వేయించుకోవాలి.
అందులో అరకప్పు క్యారెట్ తురుము, క్యాబేజీ వేసి బాగా నీళ్లు తగ్గిపోయేదాకా మగ్గనివ్వాలి. అందులోనే క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి.
అందులో ఒక స్పూను.. మిరియాల పొడి, ఉప్పు వేసి మరో నిమిషం మూత పెట్టుకోవాలి.
పచ్చివాసన పోయాక అందులో సోయాసాస్ కలుపుకుని అన్నీ కలియబెట్టి స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చపాతీ లాగా ఒత్తుకోవాలి.
ఆ మధ్యలో మోమో స్టఫ్ఫింగ్ రెండు చెంచాల దాకా పెట్టుకొని.. చపాతీని మనం కజ్జికాయలు అల్లుకున్నట్లు చేసుకోవాలి.
ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో ఉన్న పాత్రకు నూనె రాసుకొని.. కింద రెండు ప్లేట్లు వదిలేయండి.. కేవలం పై ప్లేటులో మాత్రమే మనం మోమోలు పెట్టుకుంటాం. కనీసం 10 నిమిషాల పాటూ ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మోమోలు రెడీ..