ఒక్కసారైనా

దేశంలోని కొన్ని ముఖ్యమైన జలపాతాలను జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినవి ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Ravi Kumar Sargam
Jul 02,2024
';

నోహ్స్ంగిథియాంగ్ జలపాతం

మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ జలపాతం ఉంది. 315 మీటర్ల ఎత్తులో ఉంది. వర్షాకాలంలో ఇక్కడ ప్రకృత అందాలు చూడడానికి రెండు కళ్లు చాలవు.

';

దూద్‌ సాగర్ జలపాతం

గోవా సందర్శించే సమయంలో దూద్‌ సాగర్ జలపాతం కనిపిస్తుంది. పాల సముద్రంగా గుర్తింపు పొందిన ఈ జలపాతం గోవాకు వెళ్లిన వారందరూ తప్పక సందర్శించే ప్రదేశం ఇది. దక్షిణ గోవా జిల్లాలో మండోవి నదిపై ఈ జలపాతం ఉంది.

';

బరేహిపాని జలపాతం

ఈ జలపాతం ఒడిషాలోని మయూర్‌భంజ్ ప్రాంతంలో సిమ్లిపాల్ నేషనల్ పార్క్‌లో ఉంది. 399 మీటర్ల ఎత్తులో నుంచి ధారాళంగా కిందకు చేరుతుంది.

';

జోగ్ జలపాతం

ఈ జలపాతం శరావతి నదితో ఏర్పడింది. అమెరికాలోని నయాగారా జలపాతాన్ని ఇది పోలి ఉంటుంది. 253 మీటర్ల ఎత్తులో ఉన్న జలపాతం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాలలో ఒకటి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం తిలకించాలంటే ఇక్కడకు వెళ్లాల్సిందే.

';

కుంచికల్ జలపాతం

ఇది భారతదేశంలోనే అతి పెద్ద జలపాతం. సముద్ర మట్టానికి 455 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ జలపాతం ఉంది. దట్టమైన వృక్షసంపదతో ఉన్న ఈ జలపాతం జలవిద్యుత్ ప్రాజెక్టులో ఒక భాగం.

';

మీన్‌ముట్టి జలపాతం

ఇది కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ఉంది. పచ్చని పశ్చిమ కనుమల అడవుల్లో 300 మీటర్ల ఎత్తులో ఈ జలపాతం ఉంది.

';

తలైయార్ జలపాతం

ఈ జలపాతం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. 297 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జలపాతం తమిళనాడులోనే అత్యంత పెద్దది.

';

హోగెనక్కల్ జలపాతం

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో కావేరీ నదిపై ఉన్న ఈ జలపాతం 259 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ జలపాతం ఔషధ గుణాలు ఉందని చెబుతున్నారు. ఇక్కడ పడవ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది.

';

నోహ్కలికై జలపాతం

మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఈ జలపాతం ఎత్తు 340 మీటర్లు.

';

VIEW ALL

Read Next Story